బోసిపోయిన హైదరాబాద్ రహదారులు
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రహదారులు బోసిపోతున్నాయి. సంక్రాంతి కోసం కుటుంబసమేతంగా పల్లెబాట పట్టడంతో నగరంలో సందడి తగ్గింది. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్, హిమయత్‌నగర్, బేటంపేట, సికింద్రాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వాహనాల సంచారం తగ్గిపోయింది. భోగీ, సంక్రాంతి కనుమ సందర్భంగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో రణగొణ ధ్వనులు, వాహనాల పొగతో నిత్యం సహజీవనం చేసే నగరానికి కాస్త వూపిరిదోరికి నట్టైంది.