భద్రకాళి ఆలయంలో మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు ప్రత్యేక పూజలు

వరంగల్ ఈస్ట్, నవంబర్ 30 (జనం సాక్షి)

వరంగల్ నగర మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు గురువారం చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొండా సురేఖ భారీ మెజారిటీతో గెలవడంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు. అదేవిధంగా వరంగల్ నగరం జిల్లా రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని గుండా ప్రకాష్ రావు అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మట్టవాడ హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్యక్రమంలో తణుకునూరి వీరన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.