భానుడి కిరణాలు భక్తులకు కనువిందు
శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో భానుడి కిరణాలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ ఉదయం ఆదిత్యుని లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్టును స్పృశించిన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.శివరాత్రి సంధర్భంగా నిన్న ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి కిరణాలు స్వామి విగ్రహంపై పడే అవకాశం లేకుండా పోవడంతో భక్తులు నిరాశకు గురయ్యారు.