భారతీయుల ఖాతాల సమాచారం అందించిన ఫ్రాన్స్
న్యూఢిల్లీ: భారతీయులకు చెందిన బయటికి వల్లడించని ఆదాయం రూ.565 కోట్లను ఫ్రన్స్‌లో గుర్తించినట్లు ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ద్వంద్వ పన్నుల తొలగింపు ఒప్పందం ఫలితాలను ఒస్తోందనే దానికి ఈ సమాచారమే నిదర్శనమని పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కింద ఫ్రాన్స్ తమ దేశంలోని భారతీయుల బ్యాంకు ఖాతాల సమాచారాన్ని అందించింది. 219 కేసుల్లో బయటికి వివరాలు వెల్లడించని ధనం రూ.565 కోట్ల మేర ఉన్నట్లు సీబీడీటీ పార్లమెంటు ప్రజాపద్దుల సంఘానికి ఇటీవల తెలిపింది.