భారతీయ బాక్సింగ్ సమాఖ్య రద్దు
న్యూఢిల్లీ : ఒలింపిక్స్ సంఘం రద్దుతో కుంగిపోతున్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ బాక్సింగ్ సమాఖ్యను రద్దు చేస్తూ బాక్సింగ్ అంతర్జాతీయ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారతీయ బాక్సింగ్ సమాఖ్య ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే కారణంగా అంతర్జాతీయ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.