భారత్‌, ఇంగ్లండ్‌ తొలి టీ 20 నేడే

పుణె : టీ 20 సిరీస్‌లోభాగంగా భారత్‌, ఇంగ్లండ్‌లు గురువారం తొలిమ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత్‌ దీనిలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని తహతహలాడుతోంది. టీ 20ల్లో ఆరితేరిన చాలామంది కుర్రాళ్లుండడం, కొందరు టెస్టు జట్టులో భాగం కానివారు కావడం భారత్‌కు సానుకూలాంశం. పుణె వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటల నుంచి స్టార్‌క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.