భారత్‌ ఖాతాలో ఐదో పతకం

కాంస్యం దక్కించుకున్న రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌
లండన్‌ : లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. 60 కిలోల రెజ్లింగ్‌ విభాగంలో యోగేశ్వర్‌ దత్‌ కాంస్య పతకం గెలుచుకున్నాడు. శనివారం జరిగిన రెజ్లింగ్‌ పోరులో యోగేశ్వర్‌ ఉత్తర కొరియాకు చెందిన జాంగ్‌ మయాంగ్‌ను మట్టి కరిపించాడు. దీనికి ముందు జరిగిన తొలి బౌట్‌లో యోగేశ్వర్‌ తన ప్రత్యర్థి ఫ్రాంక్లిన్‌ గోమెజ్‌పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన రెజ్లింగ్‌లో అతడు జాంగ్‌ను 3-1 తేడాతో ఓడించి భారత్‌కు ఐదో పతకం అందించాడు.