భారత్‌ ఘన విజయం

రాంచీ : రాంచీలో శనివారం భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కేవలం 3 వికెట్లు కోల్పోయి 28.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత్‌ బ్యాట్స్‌ మెన్‌లో విరాట్‌ కోహ్లీ అత్యధికంగా 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గంభీర్‌ (33), యువరాజ్‌ (30) పరుగులు చేసి రాణించారు. ధోని (10) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.