భారీ స్కోర్‌ దిశగా ఇంగ్లండ్‌

కోల్‌కతా: మూడో టెస్టులో భారత్‌ బౌలర్లు చేతులేత్తేయడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఒక వికెట్‌ నష్టానికి 216 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టులో కుక్‌ 150 పరుగులు దాటగా… ట్రోట్‌ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 105 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టానికి 296 పరుగులతో ఇంగ్లండ్‌ ఆడుతోంది. భారత్‌ తోలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటయింది.