భాష,సంస్కృతి కాపాడుకోవడంలో ముందుండాలి

శాసన సభాపతి నాదెండ్ల

హైదరాబాద్‌: భాష, సంస్కృతిని కాపడుకోవడంలో అందరూ ముందుండాలని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌ అభిప్రాయపడ్డారు. శాసన సభలో తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. దివంగతులైన గౌరవ సభ్యులకు తన హయాంలో తెలుగులోనే నివాళి అర్పించేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. భావి తరాలకు భాష గొప్పతనాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతమడానికి అందరూ కృషి చేయాలని కోరారు.

తాజావార్తలు