భూకబ్జాదారుల దాడి

హైదరాబాద్‌: షేక్‌పేట మండల డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ హసన్‌లపై భూకబ్జాదారులు దాడిచేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 13లో ప్రభుత్వ స్థలం పర్యవేక్షణకు వెళ్లిన అధికారులపై వారు దాడిచేశారు. పోలీసులు రాకతో ఒకరు పరారు కాగా మరొకరిని అరెస్టు చేశారు.