మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా కృష్ణమూర్తి
కమాన్ పూర్, జనం సాక్షి : కమాన్ పూర్ మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా మండల కేంద్రానికి చెందిన సీనియర్ బి.ఆర్.ఎస్ నాయకుడు గడప కృష్ణమూర్తిని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు నియమించారు. గతంలో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా ఉన్న పొన్నగంటి కనకయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఆస్థానం ఖాళీ అయింది. దీంతో బి ఆర్ ఎస్ పార్టీలో చురుకైన నాయకుడుగా ఉన్న కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తిని నియమించారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న గడప కృష్ణమూర్తికి ఈ పదవి అప్పగించడం పట్ల పూర్తిస్థాయిలో న్యాయం జరిగింది. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా ఎన్నికైన గడప కృష్ణమూర్తిని శ్రీ ఆది వరహస్వామి ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత జగన్నాథరావు సర్పంచ్ నీలం సరిత శ్రీనివాస్ టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పెన్ రెడ్డి కిషన్ రెడ్డి కమాన్ పూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొల్లేపల్లి శంకర్ గౌడ్ సిద్ది పల్లె సర్పంచ్ తాటికొండ శంకర్ పెంచికలపేట సర్పంచ్ కొండ వెంకటేష్ సింగల్ చైర్మన్ ఇనగంటి భాస్కరరావు వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్ ఎంపీటీసీలు కోలేటి చంద్రశేఖర్ గోడిసెల ఉమా సంపత్ నాయకులు ఇనగంటి రామారావు గుర్రం లక్ష్మి మల్లు ఉప సర్పంచ్ జాబు సతీష్ , కొట్ట భూమయ్య నీలి రాజయ్య, నక్క శంకర్ మెరుగు కుమార్, చిప్పకుర్తి శ్రీనివాస్ అంబిరి శ్రీనివాస్., బోనాల సత్యం లింగస్వామి లు ఆదివారం స్వామి సన్నిధిలో శాల్వల తో సత్కరించారు.