మంత్రి టీజీ వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల ఆగ్రహం

హైదరాబాద్‌: మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌లు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేశౄరు. అధికారులు సక్రమంగా పని చేయకపోతే కాల్చిపారేయాలనడం మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఐఏఎస్‌లు పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయన్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరించాలని సూచించారు. అధికారుల పనితీరు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటుందని తెలిపారు. మంత్రిపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారుల పనితీరు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటుందని తెలిపారు. మంత్రిపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని ఐఏఎస్‌లు నిర్ణయించారు.