మంత్రి దానం కుడిచేతికి గాయం

హైదరాబాద్‌: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ కుడిచేతికి గాయమైంది. ఆయనకు యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేసి కుట్లు వేశారు. చికిత్స కోసం ఉదయం నుంచి రెండు సార్లు మంత్రి ఆసుపత్రికి వచ్చారు. అయితే మంత్రి గాయానికి గల కారణాలనే వైద్యులు వెల్లడించలేదు.