మంత్రి పదవి ఇబ్బంది పెడుతోంది : జానారెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ తీసుకురావడం తమ వల్ల కాదనిపిస్తే ఇతరుల వద్దకు వెళ్లవచ్చని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు.  తెలంగాణ  రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. తెలంగాణ కోసం మేం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడున్న మంత్రిపదవే తమకు ఇబ్బంది పెడుతోందని చెప్పారు. తెలంగాణ సమస్యను పార్టీ అధిష్టానవర్గం కేంద్రం వెంటనే తేల్చాలని అన్నారు. మంత్రులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలు చేసిన వారిపై నిఘా పెట్టాలన్నారు. మంత్రులపై నిఘా పెట్టడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదన్నారు. తెలంగాణ ఆస్తి అంతకుమించి ఏమీ వద్దన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వారంలోగా కోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. బతుకుండి సాధించుకోవాలని కేంద్రమంత్రి బలరాంనాయక్‌ అన్నారు. తెలంగాణ తప్పకుండా వస్తుందన్నారు. త్వరలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.