మక్కాలో సీసీ కెమెరాలు!

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ అన్నారు. మంగళవారం ఆయన మక్కామసీదు వార్షిక మెయింటెనెన్స్‌ కమిటీ సభ్యులతో సిసి టివి కెమెరాలు, డోర్‌ ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు, చేతి మెటల్‌ డిటెక్టర్లు, యుపిఎస్‌ ఏర్పాట్లుపై సమీక్షించారు. సౌత్‌ జోన్‌ డిసిపి అకు సబర్వాల్‌, అడిషనల్‌ డిసిపి సిద్దీకి, మక్కామసీద్‌ సూపరింటెండెంట్‌ నయీముద్దీన్‌, ఎపిటిఎస్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఈడి అక్రమ్‌ ఆలీ తదితరులు పాల్గొన్నారు.