మత్తడి వాగు మూడు గేట్లు ఎత్తివేసిన అధికారులు

ఆదిలాబాద్‌: తలమడుగు మండలాలల్లో ఆదివారం భారీగా కురిసిన వర్షంతో మత్తడివాగు ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్‌ మూడు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 16,000 వేల క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 20,000 క్యూసెక్కులను బయటికి పంపిస్తున్నట్లు తెలిపారు.