మరోసారి పెట్రో ధరల పెంపు?
న్యూఢిల్లీ : ఈ వారంలో మరోసారి పెట్రో ధరలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పెట్రోలు ధర లీటరకు ఒక రూపాయి, డీజిల్ ధర లీటరుకు 50 పైసలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. గత నెల 17నే పెట్రో ధరలను సవరించిన విషయం తెలిసిందే. అప్పుడు పెట్రోల్ ధరను 29 పైసలు తగ్గించి డీజిల్ ధర 50 పైసలు పెంచారు.



