మరో తెలంగాణ ఉద్యమం అవసరంలేదు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే మరో తెలంగాణ ఉద్యమం అవసరంలేదని ఆ ప్రాంత ప్రతిపక్ష నేతలు స్పష్టంచేశారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యోగుల కిరణం’ మాసపత్రిక  ఆవిష్కరణ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతలంలో జరుగుతున్న అన్యాయాలను ఇలాంటి పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఐకాస ఛైర్మన్‌ కోదండరాం కోరారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కూడా ఒక డెడ్‌లైన్‌ పెట్టుకొని ముందుకు పోవాలని, లేనిపక్షంలో తెలంగాణ ప్రాంతంలో వారి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ  రాష్ట్ర ప్రక్రియను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అపాలని చూస్తే వూరుకునేది లేదని భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ హెచ్చరించారు.