మరో వారం వర్షాలు, ఈ సీజన్‌లో వర్షాలకు చివరి దశ

న్యూఢిల్లీ: కరవు కోరల గండం నుంచి దేశాన్ని గట్టెక్కించిన నైరుతి రుతుపవనాల ప్రభావం కనీసం మరో వారం కొనసాగనుంది. దీని పర్యవసానంగా వాటి నిష్క్రమణ ఇంకో వారం రోజులు ఆలస్యం కానుంది. నైదుతి రుతుపవనాలు మరికొద్ది కాలం వర్షాలను అందించనున్నాయి అని భారత వాతావరణశాఖ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ స్వాతి బసు వెల్లడించారు. ఈ సీజన్‌లో వర్షాలకు ఇది చివరి దశని స్వాతి బసు చెప్పారు. పశ్చిమ రాజస్థాన్‌ నుంచి వాటి నిష్క్రమణ వచ్చే వారంలో ఉంటుందన్నారు.