మలేషియాలో తెలుగు యువతిపై ఆత్యచారం

మలేషియా: రాష్ట్రనికి చెందిన తెలుగు యవతి మలేషియాలో సంవత్సరానికి పైగా ఆత్యచారానికి గురిఅవుతుంది. 2010 సంవత్సరంలో మలేషియాకు వలస వచ్చింది. వచ్చిన కొత్తలో కొంత కాలం పాటు జోహార్‌ రాష్ట్రంలోని పెర్మాస్‌జయలో పనిచేస్తుంది. యజమాని తనప రోజు అత్యాచారాని పాల్పడేవాడని, ప్రతిఘటిస్తే హింస పెట్టేవాడని పోలీసులకు తెలిపింది. పీర్యాదు చేసినట్లు స్టార్‌ దినపత్రికకు తెలిపింది. రెండు సార్లు అబార్షన్‌ చేయించాడని తెలిపింది. గత నెలలో అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు స్థానిక చర్చిగ్రూప్‌ హక్కుల సంస్థ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. భారత హైకమిషన్‌కు, కార్మికశాఖకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు నాలుగుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని కేవలం నిందుతున్ని హెచ్చరించి వదిలేశారని తెలిపింది. తన యజమాని కొన్ని నెలలుగా జీతం కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక సంఘాలు కోరుతున్నాయి. తాను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని. తనకు పోలీసులు సహాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆమె తెలిపింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.