మహిళల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ

శివ్వంపేట సెప్టెంబర్ 28 జనంసాక్షి :
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం తరుపున మహిళలను గౌరవించేందుకే సీఎం కేసిఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేస్తోందని పెద్ద గొట్టి ముక్ల  సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం, ఉప సర్పంచ్ నవీన్,  బిజిలిపూర్ సర్పంచ్ చిట్యాల లక్ష్మీ బాలపోచయ్య, ఉపసర్పంచ్ షేక్ చాంద్, చెన్నాపూర్ సర్పంచ్ బోల్ల భారతి బిక్షపతి, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి లు అన్నారు. శివ్వంపేట మండలంలోని బిజిలిపూర్, చెన్నాపూర్ పెద్దగొట్టి ముక్ల గ్రామాలలో సీఎం కేసిఆర్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ పండుగ చీరలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ సంస్కృతిని పట్టించుకోలేదని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదరిస్తూ ప్రతి పండగను ఘనంగా నిర్వహిస్తుందని ఆయన అన్నారు. బతుకమ్మ పండుగను అధికారికంగా జరిపించడమే కాకుండా బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతుందని వారన్నారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు చిట్యాల పోచయ్య, నవీన్ గుప్త,పంచాయతీ కార్యదర్శులు ,మహిళా సంఘం  సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Attachments area