మాజీ న్యాయమూర్తి చలపతిరావుకు రూ. 3 కోట్లు ఇచ్చా !

గాలి బెయిల్‌ కేసులో ప్రధాన నిందితుడు యాదగిరిరావు అంగీకారం
హైదరాబాద్‌ : గనుల గజిని గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ మంజూరు కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు యాదగిరిరావు నేరాంగీకార పత్రంలోని కీలక వివరాలు వెల్లడయ్యాయి. గాలికి బెయిల్‌ మంజూరు కోసం మాజీ న్యాయమూర్తి చలపతిరావుకు రూ. 3 కోట్లు ఇచ్చినట్లు యాదగిరిరావు తన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. గాలికి బెయిల్‌ మంజూరైన తర్వాత తనకు రూ. 2.50కోట్లు అందాయని తెలిపారు. అదే విధంగా జూనియర్‌ న్యాయవాది అదిత్యకు రూ. కోటి, పోలీస్‌ అధికారి సర్వేశ్వరరెడ్డికి బెయిల్‌ కోసం న్యాయమూర్తి పట్టాభికి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు.