మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం  ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరిలించారు. ఈ బెయిల్‌ వ్యవహారంలో ఇప్పటికే విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు, పట్టాభి కుమారుడు రవిచంద్రను ఏసీబీ అరెస్టు చేసింది.