మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు మధ్య కాల్పులు

రాయిపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని మర్దకల్‌-సికాసర్‌ ప్రాంతంలో మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల  మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాల్పులు అనంతరం మావోయిస్టుల వద్ద నుంచి 12 తుపాకులు, ఒక డిటోనేటర్‌, 2 టిఫిన్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నాట్లు భద్రతా సిబ్బంది తెలియజేశారు.