మా ఎన్నికల్లో కీలక మలుపు

ctfabl7gహైదరాబాద్‌, మార్చి 25 : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుంచి ఉత్తేజ్‌, శివాజీరాజా పోటీ నుంచి తప్పుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ నుంచి ప్రధాన కార్యదర్శిగా శివాజీరాజా, జాయింట్‌ సెక్రటరీగా ఉత్తేజ్‌ నామినేషనల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారాణాల వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఉత్తేజ్‌ తెలిపారు. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పోటీ నుంచి తప్పుకోడానికి గల కారణాలను శివాజీరాజా వెల్లడించే అవకాశం ఉంది.