మా కార్యాలయం చుట్టూ ఎన్నికల హావిూలు


స్థలం చూశానంటూ మంచు విష్ణె పోస్ట్‌
ఈసారి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు అంతా కార్యాలయ భవనం చుట్టే తిరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి మంచు విష్ణు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన అజెండా కూడా ’మా’ శాశ్వత భవనం నిర్మాణమే! భవంతి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఆయనే సమకూర్చుతానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేసే పనిలో నిమగ్నమయ్యారు విష్ణు. తాజాగా బిల్డింగ్‌ నిర్మాణానికి మూడు చోట్ల స్థలాలు చూసినట్లు శనివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ‘మా’ భవనం మన అందరి కల. అది త్వరలోనే నెరవేరబోతుంది. నేనే స్వయంగా వెళ్లి మూడు స్థలాలను చూశా. వాటిలో ఏది అనుకూలంగా ఉంటుందనే అందరం కూర్చుని నిర్ణయిద్దాం. త్వరలోనే మన కల నెరవేరనుందని ఓ వీడియో పోస్ట్‌ చేశారు. మా శాశ్వత భవంతి నిర్మాణం కోసం తన సొంత డబ్బును వెచ్చిస్తానని ఎవరూ రూపాయి కూడా పెట్టాల్సిన పనే లేదని ప్రకటించడం సంచలనమే అయ్యింది. సెప్టెంబర్‌ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీనినే అతడు ఎజెండాగా ప్రకటిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. తాజాగా తన సోషల్‌ విూడియాలో విష్ణు ఒక వీడియోను పోస్ట్‌ చేసారు. దీనిలో ఓంం శాశ్వత భవనానికి సముచితంగా సరిపోయే మూడు సైట్లను కనుగొన్నానని వాటి నుంచి ఒకటి అందరం కలిసి ఎంపిక చేద్దామని ప్రకటించి షాకిచ్చాడు. మా అసోసియేషన్‌ శాశ్వత ఆఫీస్‌ ని కలిగి ఉండటం మనందరి కల. నేను వ్యక్తిగతంగా మూడు స్థలాలను సందర్శించాను. ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. మనమంతా ఆ మూడిరటి నుంచి బెస్ట్‌ స్థలాన్ని ఎంపిక చేసుకుందాం అని ప్రకటించారు. శాశ్వత భవనం కోసం విష్ణు కొంత సీరియస్‌ గానే దృష్టి పెట్టి పని చేస్తున్నారని అర్థమవుతోంది. మాఎన్నికల్లో సొంత భవంతి నిర్మాణమే ప్రధాన ఎజెండాగా పలువురు సభ్యులు పోటీబరిలో దిగుతున్న వేళ అసలు సొంత భవంతి అవసరమే లేదని బండ్ల గణెళిష్‌ అన్నారు. దానికంటే పేద ఆర్టిస్టులకు సొంత ఇల్లు కట్టివ్వాలని గణెళిష్‌ కోరారు. తాను శాశ్వత భవంతి నిర్మాణానికి వ్యతిరేకినని.. ఈ సంక్లిష్ట సమయంలో మంచి సంక్షేమ కార్యక్రమాలు చాలా అవసరమని బండ్ల అన్నారు. ఈసారి పోటీబరిలో ప్రకాష్‌ రాజ్‌ .. విష్ణు దూకుడువిూదుండగా.. జీవిత రాజశేఖర్‌` హేమ` సీవీఎల్‌ వంటి వారు ఈ పోటీలో ఉన్నారు. ప్రకాష్‌ రాజ్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎకరం భూమి ఇవ్వాల్సిందిగా కోరతానని అన్నారు. అలాగే మంచు విష్ణు మా భవంతి నిర్మాణానికి అవసరమయ్యే మొత్తం డబ్బు తానే సమకూరుస్తానని ఎవరూ ఇవ్వాల్సిన పనే లేదని శపథం చేశారు.