మా మద్దతు ప్రణబ్‌ కే : మమతా బెనర్జీ

ఢిల్లీ : కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో తర్జన బర్జన పడుతున్న తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రణబ్‌కే మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.మొదట ప్రణబ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన మమత ఇక తప్పని పరిస్థితుల్లోనే దాదాకు మద్దతివ్వాల్సివచ్చింని తెలిపారు. అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ కోరుకుందనీ, కానీ ఆయనకు అన్ని పార్టీల మద్దతు లభించలేదని మమత అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల పై ఈ రోజు కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో దీదీ ఈ నిర్ణయం తీసుకుంది.