మీడియాలో ప్రచారానికి జగన్‌ హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ :  అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మీడియా ద్వారా ఉప ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు వీలుగా తనకు అనుమతివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అనుమతించాలని జగన్‌ తరఫు న్యాయవాదులు బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్‌ 19(1)ని అనుసరించి భావ ప్రకటనా స్వేచ్ఛని కల్పించాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.