ముంబయికి చేరుకుంటున్న నేతలు
ముంబయి: అనారోగ్యంతో కన్నుమూసిన శివసేన అధినేత బాల్ ధాకరేకు నివాళులు అర్పించేందుకు నేతలు ముంబయి చేరుకుంటున్నారు. భాజపా అగ్రనేతలు ఒక్కొక్కరుగా ముంబయి వస్తున్నారు. భాజపా నేత సుష్మాస్వరాజ్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తదితరులు మరికా సేపటిలో నగరానికి చేరుకోనున్నారు. మరో వైపు తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు బాంద్రాలోని మాతోశ్రీకి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు.