ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ
హైదరాబాద్: మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన తెలంగాణ మంత్రుల భేటీ ముగిసింది, తెలంగాణ మార్చ్‌పై ఈ సమావేశంలో మంత్రులందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం మంత్రులందరూ ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించారు. కవాతు శాంతియుతంగా జరిగే విధంగా దృష్ణ సారించే యోచనలో తెలంగాణ మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశమనంతరం మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ కవాతుకు అనుమతిస్తే శాంతియుతంగా నిర్వహిస్తామని కొన్ని సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ అంశంపై ఆలోచించాలన్నారు. కవాతుపై నిర్ణయం ప్రజారంజకంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులంతా పరస్పరం సహకరించుకుని పనిచేయాల్సి అవసం ఉందని అభిప్రాయపడ్డారు.