ముత్యాలంపాడులో మరో 10 మంది అరెస్టు

పరవాడ(విశాఖ): విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలోని ముత్యాలంపాలెంతో మంగళవారం కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గత కొద్ది రోజులుగా రెండు మత్స్యకార వర్గాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో విశాఖ సౌత్‌ ఏసీపీ దాసరి రవిబాబు తెదేపాకు చెందిన మత్స్యకార నాయకుడు ముత్యాలు, అర్జల మసేన్‌తో పాటు మరో 10 మందిని అరెస్టుచేసి రిమాండ్‌కు  తరలించారు. ప్రస్తుతం గ్రామం పోలీసుల ఆధినంలో ఉంది.