మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా బోడ్ల శ్రీనివాస్ ఎన్నిక
మెట్పల్లి టౌన్, మార్చి 22,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణ మున్నురు కాపు సంఘం అధ్యక్షునిగా బోడ్ల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, అలాగే ఉపాధ్యక్షులుగా బోడ్ల ఆనంద్, సూతరి బుమారెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరి ఎన్నికపై మున్నురు కాపు సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షులు బోడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘంను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తానని అన్నారు. మా ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు