మున్సిపాలిటీల్లో సమస్యలు పరిష్కరించండిమంత్రి సబితకు పహాడీషరీఫ్ కౌన్సిలర్ల వినతి
హైదరాబాద్,నవంబర్10(జనం సాక్షి): పహాడీ షరీఫ్ మున్సిపాలిటీలోని 18వ వార్డులో సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని వార్డు కౌన్సిలర్తోపాటు పలువురు వార్డు ప్రజలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని 18వ వార్డు కౌన్సిలర్ కెంచె లక్ష్మీనారాయణ, వార్డు వాసులు బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. న్యూ బృందావన్ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, దానితో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.కాగా ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని మున్సిపల్ కమిషనర్ జి.పి కుమార్కు పోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారని కౌన్సిలర్ తెలిపారు. అలాగే శ్రీరామకాలనీ నుంచి రామాలయం వరకు బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు రూ. 60 లక్షల నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వాసుబాబు, చెన్నం రాజేశ్, గుండు నర్సింగ్ పాల్గొన్నారు.