ముస్లింల అభివృద్దికి తోడ్పతాం-చంద్రబాబు

హైదరాబాద్‌: పాతబస్తీలో రంజాన్‌ మాసం సందర్భంగా తెలగుదేశం అదినేత చంద్రబాబునాయుడు పేద మస్లిం ప్రజలకు బియ్యం, వస్త్రాలు,డబ్బు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ది, సమస్యల పరష్కారం కోసం ఎన్ని కమిటీలు నివేదికలు సమర్పించినా అవి అమలుకు నోచుకోవటం లేదని అన్నారు. తాము అదికారంలోకి వస్తే సచార్‌కమిటీ, రంగనాథ్‌ మిశ్రా కమిటీ సఫారసులన్నింటినీ అమలుచేసి, ముస్లింల అభివృద్దికి తోడ్పతామని ఆయన అన్నారు. సమాజంలోని అన్నివర్గాల అభివృద్దే తెలుగుదేశం ధ్యేయమని చెప్పారు.