మృతదేహాలను పరిశీలించిన జిల్లావైద్యాధికారి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని పెద్దచెరువులో బయటపడిన మృతదేహాలను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. ఘటనా ప్రాంతంలో  మానవ శరీర భాగాలు కుప్పగా పోసివుండటాన్ని చూశారు. వైద్య కళాశాలలో నిల్వ వుంచిన అవయవాలను ఘటనా  ప్రాంతంలో పడేసినట్లు వైద్య అధికారులు భావిస్తున్నారు. చెరువులో మరిన్ని మృతదేహాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది