మెజారిటీ రావడం కోసం కష్టపడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు

మంథని, (జనంసాక్షి ) : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు భారీ మెజారిటీతో మంథని ఎమ్మెల్యే గా గెలిపించడం లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం మంథని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంథని మండలంలో శ్రీధర్ బాబుకు 4786 మెజారిటీ వచ్చినందుకు చాలా సంతోషం గా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ వారి కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ఎంపీపీ కొండ శంకర్, మంథని అసెంబ్లీ ఎన్నికల మీడియా కన్వీనర్ ఇనుముల సతీష్, మండల, టౌన్ ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, కుడుదుల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య, మంథని టౌన్ అధ్యక్షులు పొలు శివ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, వైస్ ఎంపీపీ స్వరూప్ రెడ్డి,ఎంపిటిసిలు ప్రభాకర్ రెడ్డి, రాజయ్య , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.