మైత్రి పరివార్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల వనరుల కేంద్రం ఆవరణలో మైత్రి పరివార్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో టేకు మొక్కలను నాటే కార్యక్రమం జరిగింది. సామాజిక సేవలో భాగస్వాములు కావటంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్క పౌరుడు పాలు పంచుకోవాలని సంఘం నాయకులు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో తహసిల్దార్‌ సుమ, ఎంపీడీఓ చంద్రమౌళి ఎంఈఓ రాజయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.