‘మైనర్’ నిందితుడికి గవ్చువ్గా శస్త్రచికిత్స
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రిలో నాలుగు రోజుల క్రితం ఒక మైనర్ బాలుడికి అపెండిసైటిన్ శస్త్రచికిత్స జరిగింది. నిదానంగా, ఎంతో సభ్యతగా ప్రవర్తించిన ఆ బాలుడిని చూసి వైద్యులు ముచ్చటపడ్డారు. జువైనైల్ హోమ్ నుంచి తీసుకువచ్చారు. కాబట్టి ఆ పేషెంటే వద్ద ఎప్పుడూ పోలీసులు కాపలా ఉండేవారు. అలాంటి పేషెంట్లు వస్తూనూ ఉంటారు కాబట్టి డాక్టర్లు అంతగా పట్టించుకోలేదు చికిత్స పూర్తయ్యాక కానీ వైద్యులకు తెలియలేదు ఆ పేషెంట్ దారుణమైన నేరంలో నిందితుడని, ఢిల్లీ ఘటనకు సంబంధించి సోమవారం న్యాయస్థానానికి ఐదుగురు నిందితులు మాత్రమే హాజరయ్యారు. ఆరో నిందితుడైన మైనర్ బాలుడికి అత్యవసరంగా అపెండిసైటిన్ ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. పోలీసు శస్త్రచికిత్స అనంతరం అతను కోలుకుంటున్నట్లు సమాచారం తెలిసింది.