మోడీ కోతి చేష్టలు అర్జున్‌ అభివర్ణన

అహ్మదాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాజకీయ నాయకులు ప్రసంగాలలో ఉపయోగించే భాష దారితప్పుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు వ్యక్తుల మనోభావాలను సైతం దెబ్బతీస్తున్నాయి. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఉపందుకున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ అర్జున్‌ మొద్వాడియా నరేంద్రమోడీనే టార్గెట్‌ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ కోతిలాంటివాడంటూ.. సంభోదించారు. అయితే ఆయన మోడీ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన ప్రసంగం ఇలా సాగింది…. ‘కొంతమందిని కుక్క కరిచిందని వారు ఎల్లప్పుడూ ప్రధానిమంత్రి మన్మోహన్‌ సింగ్‌నే టార్గెట్‌ చేస్తూ ప్రసంగిస్తున్నారని, కానీ వారు ఏదో ఒకనాడు ఈ దేశానికి ప్రధానిమంత్రి కావాలని కలలు కంటున్నారని మోడీ పేరు ప్రస్తావించకుండా ఎద్దేవా చేశారు. మన్మోహన్‌సింగ్‌ సింహం లాంటివాడని అర్జున్‌ మొద్వాడియా అభివర్ణించారు. ఇలా రాజకీయ ప్రసంగాలు చేస్తూ నేతల వ్యక్తిగత విషయాల మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూ అబద్ధాలు చెప్పే నేతలకు నోబుల్‌ ప్రైజ్‌ ఇవ్వచ్చని మోడీ పేరు చెప్పకుండా అర్జున్‌ విమర్శించారు.