యాజమాన్య తొత్తు సంఘాలను నమ్మకండి

కాకతీయఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : సింగరే ణి కార్మికులకు రూ 800 కోట్ల లాభం చేకూర్చే 4 7 డిమాండ్లతో ఏఐటీయూసీ సమ్మెకు పిలుపునిస్తే ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్‌, హెచ్‌ఎంఎస్‌లు యాజమాన్యం చంకలో దూరి సమ్మెను విచ్చిన్నం చేశాయని ఏఐటీయూసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై. గట్టయ్య ఆరోపించారు. సకలజనుల సమ్మెకు ఉసి గొల్పిన రాజకీయ జెఏసినే ఏరియర్స్‌లో సకల జ నుల సమ్మె కాలంలో యాజమాన్యం ఇచ్చిన అడ్వా న్స్‌ను కోతలేకుండా అందించేందుకు కృషి చేయా లని కోరారు. శనివారం స్థానిక కాకతీయ ప్రెస్‌క ్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏఐటీయూసీి చేసిన పనులపట్ల కా ర్మికులు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఏరియర్స్‌ లో యాజమాన్యం కోత విధించడంపై తాము కో ర్టుకు వెళ్లి స్టే తెచ్చినట్లు చెప్పారు. కాని యాజమా న్యం ఆ డబ్బులను ఇవ్వకుండా ఏగవేసే విధంగా వాయిదా ఏసినట్లు పేర్కొన్నారు. ఇందుకు టీబీజీకే ఎస్‌, ఐఎన్‌టీయూసీిలే కారణమని తెలిపారు. వా రసత్వ ఉద్యోగాల విషయంలో అన్ని సంఘాలు రాద్దాంతం చేస్తున్నాయని ప్రభుత్వరంగ సంస్థలో నూతన ఉద్యోగాలకు అవకాశంలేదని నాటి ప్రధా ని పివి నరసింహారావు బ్యాన్‌ విధించినట్లు తెలిపా రు. బ్యాన్‌ ఎత్తివేస్తేనే తిరిగి ఉద్యోగ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయమై వేజ్‌బో ర్డుకు ముందే చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్‌లో 11.05. 2011న ఎత్తివేయాలని 5 జాతీయ సంఘాలు కో రినట్లు చెప్పారు కాని ఎత్తివేయక ముందే ఐఎన్‌ టీయూసీి, టీబీజీకేఎస్‌లు వారసత్వ ఉద్యోగాలు ఎ లా ఇప్పిస్తారని ప్రశ్నించారు. ఏఐటీయూసీిని విమ ర్శించడమే పనిగా ఇతర సంఘాలు వ్యక్తిగత, దిగ జారుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. లాబా ల వాటాను సృష్టించి తొలిసారిగా 10 శాతం వా టాను ఇప్పించినట్లు పేర్కొన్నారు. పెన్షన్‌ను 40 శాతం పెంచి రూ 10 వేలు తగ్గకుండా ఉండేలా చూస్తామని, రిటైర్‌ కార్మికునికి కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. లాబాల్లో వాటా 25 శాతం ఇవ్వాలని సింగరేణి సిఅండ్‌ ఎండిని కలిసినట్లు దీనికి సుముఖతను వ్యక్తం చేస్తూ ఎన్నికల అనంతరం ఇచ్చేందుకు అంగీ కరించినట్లు తెలిపారు. సింగరేణి ఎన్నికలు వేరని, రాజకీయ ఎన్నికలు వేరని రానున్న ఎన్నికల్లో కా ర్మికుల వెన్నంటి ఉండే ఏఐటీయూసీని అక్కున చే ర్చుకోవాలని కోరారు. సమావేశంలో బ్రాంచి కా ర్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, సహాయ కార్యదర్శి మోటపలుకుల రమేశ్‌, ఉపాధ్యక్షుడు జిల్లా తిరు పతియాదవ్‌, గాదె పుల్లయ్య, రాంచెందర్‌, ఎం రాజేశ్వర్‌రావు, ఎం కొమురయ్యలు పాల్గొన్నారు.