యాదగిరిరావును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల కేసులో రౌడీషీటర్‌ యాదగిరిరావును ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైల్లో కస్టడీలోకి తీసుకున్నారు.తేదీ 8-07-2012 నుండి ఐదు రోజులపాటు యాదగిరిని ప్రశ్నించేందుకు న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దనరెడ్డికి బెయిల్‌ మంజూరు చేసే విషయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావుతో ఒప్పందం కుదర్చటంలో కీలక పాత్రధారి యాదగిరే. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తేల్చేందుకు ఏసీబీ యాదగిరిరావును విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్టు కాగా గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి, కర్ణాటకలోని కంప్లీ ఎమ్మెల్యే సురేష్‌లపైనా కేసు నమోదయింది.