యాసిడ్‌ విక్రయాల నియంత్రణపై ఆఫిడవిట్‌ దాఖలు చేయండి

న్యూఢిల్లీ: మహిళలపై దాడుల కోసం యాసిడ్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించుకుండా నిరోధించడానికి వాటి విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియచేయాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. నేరగాళ్లకు యాసిడ్‌ సులువుగా దొరక్కుండా తీసుకునే చర్యల విషయమై సమగ్ర ఆఫిడవిట్‌ దాఖలు చేయాలంది. ఇదే ఆంశానికి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరి 11న జారీ చేసిన నోటీసులకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సమాధానాలు దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎంలోదా, జస్టిస్‌ ఎ.ఆర్‌.దవెత్‌ కూడిన ధర్మాసనం ఆదేశించింది.