యుపిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా అన్సారి నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ, జూలై 18 : యుపిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారి బుధవారంనాడు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎదుట దాఖలు చేశారు. హమీద్‌ అన్సారీతో పాటు యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, ఎంపి రాహుల్‌గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, ఎన్‌సిపి అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌, డిఎంకె ప్రతినిధి టిఆర్‌ బాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.