యువతిని వేధించిన హెడ్‌కానిస్టేబుల్‌ అరెస్టు

హైదరాబాద్‌ : ఆకతాయిలు వేధిసున్నారని ఫిర్యాదు చేసిన యువతినే వేధింపులకు గురి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌రెడ్డిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్‌రెడ్డి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌కానిస్టేబుల్‌ వివేకానందనగర్‌కు చెందిన ఓ యువతి తనను కొంతమంది వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు సమయంలో ఆ యువతి ఫోన్‌ నెం తీసుకున్న అశోక్‌రెడ్డి సమస్య తీరుస్తానంటూ ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడాడు. అక్కడితో అగకుండా ఇంటికి వెళ్లి మరీ వేధించాడు. భయపడిన ఆ యువతి డీసీపీకి ఫోన్‌ చేసి విషయం తెలిపింది. వెంటనే కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసి అశోక్‌రెడ్డిని అరెస్టు చేశారు.