యూపీఏ ఏకపక్ష నిర్ణయాలవల్లే భాగస్వామ్యపక్షాలు బయటకు వెల్తున్నాయి

హైదరాబాద్‌: కేంద్రంలో ఉన్న యూపీఏ ఏకపక్ష నిర్ణయాలవల్లే భాగస్వామ్యపక్షాలు బయటకు వెళ్లిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం తమకు ఆరాటంలేదని, ఎన్నికలు రావాలని కోరుకోవట్లేదన్నారు.