యూపీ మంత్రి రాజీనామా

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూ, పునరావాస శాఖ మంత్రి వినోద్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. గోండా జిల్లా ముఖ్య వైద్యాధికారి ఎన్‌.పి.సింగ్‌ కిడ్నాప్‌ వ్యవహరంలో ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. మరోవైపు ఈ వ్యవహారం పై యూపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.