రాందేశ్‌ అనుచరుడు బాలకృష్ణపై సీబీఐ ఛార్జిషీట్‌

డెహ్రాడూన్‌ : యోగా గురు బాబా రాందేవ్‌ అనుచరుడు బాలకృష్ణ నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారంపై ఇక్కడి స్థానిక న్యాయస్థానంలో సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. పాస్‌పోర్ట్‌ పొందేందుకు బాలకృష్ణ విద్యార్హతకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారని సీబీఐ పేర్కొంది. ఇలా ఆయన పాస్‌పోర్ట్‌ చట్టాన్ని అతిక్రమించారని వెల్లడించింది. బాలకృష్ణ జాతీయతకు సంబంధించిన వివరాల కోసం నేపాల్‌ ప్రభుత్వాన్ని కోరినా… ఎలాంటి సమాచారం రాలేదని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.