రాగంపేట్ గ్రామం ఓబీసీ అధ్యక్షులుగా బత్తిని రమేష్
ఖానాపురం సెప్టెంబర్ 2జనం సాక్షి
మండలంలోని రాగం పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు రాగం పేట గ్రామంలో ఓబీసీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ అధ్యక్షుడిగా ఓబీసీ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ ఓర్స్ తిరుపతి, నెక్కొండబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డిహాజరయ్యారు.ఓబీసీ సెల్ ఖానాపూర్ మండల అధ్యక్షులు వల్లే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓబీసీ సెల్ గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు.రాగంపేట గ్రామంఓబీసీ సెల్అధ్యక్షులుగా బత్తిని రమేష్ ని ఏకగ్రీవంగా ఎందుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ గ్రామాన కమిటీలు వేసుకొని మాధవ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికులు లాగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
ఖానాపూర్ మండల పార్టీ అధ్యక్షులు వేములపల్లి వెంకట ప్రసాద్, జిల్లా నాయకులు శాఖమూరి హరిబాబు, మండల ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు కాబట్టి రమేష్, ఉప సర్పంచ్ రవీందర్,సీతారామారావు,రవి,సాం బయ్య, రాజు,తదితరులుపాల్గొన్నారు