రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

బాగ్‌లింపంపల్లి : మహిళలకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మహిళా రాజ్యాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం సుందరయ్య కళానిలయంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళలకు అధికారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కవిత పాల్గొన్నారు.